News December 23, 2024

రేపు అన్నమయ్య జిల్లాలో స్కూళ్లకు ఐచ్ఛిక సెలవు

image

క్రిస్మస్ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో డిసెంబర్ 24 మంగళవారం ఐచ్ఛిక సెలవుగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు, అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు ఈ సందేశాన్ని ఆయన పంపారు. అన్నమయ్య జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఈ సెలవు ఇస్తున్నామని తెలిపారు.

Similar News

News December 23, 2024

కడప: ఎవరో ఒకరు తగ్గండి..!

image

కడప కార్పొరేషన్ గత సర్వసభ్య సమావేశంలో మేయర్ సురేశ్ పక్కన తనకు కుర్చీ వేయలేదని MLA మాధవి రెడ్డి ఆందోళనకు దిగడంతో సభ జరగలేదు. ఇవాళ్టి సమావేశంలోనూ ఆమెకు కుర్చీ లేకపోవడంతో మేయర్‌ను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. గతంలో ఇదే మేయర్ MLAకు కుర్చీ వేసి ఇప్పుడే నిరాకరించడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇద్దరూ పంతానికి వెళ్తే తమ సమస్యలపై చర్చ ఎలా జరుగుతుందని కడప ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News December 23, 2024

ఈనెల 24న కడప జిల్లాకు YS జగన్

image

ఈనెల 24న కడప జిల్లాకు YS జగన్ రానున్నారు. అనంతరం జిల్లాలో 4 రోజులపాటు పర్యటించనున్నారు. 24వ తేదీన ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు. 25న పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు చేస్తారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 27న తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.

News December 23, 2024

వాళ్లను జగన్ మోసం చేశారు: నిమ్మల

image

కడప జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గండికోట జలాశయం పరిశీలన తర్వాత ఆయన మాట్లాడారు. ‘గండికోట నిర్వాసితులకు పరిహారం పెంచి ఇస్తామని జగన్ చెప్పారు. కానీ ఐదేళ్లలో ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు మేము వాళ్లకు రూ.450 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. హంద్రీనీవాకు రూ.2500 కోట్లు కేటాయించాం. త్వరలో పనులు పూర్తి చేస్తాం’ అని నిమ్మల అన్నారు.