News October 19, 2025

రేపు అన్నమయ్య జిల్లా ‘ప్రజా ఫిర్యాదుల వేదిక’ రద్దు

image

అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్చిన ‘ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక’ను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయ పోలీసులు ‘ప్రజా ఫిర్యాదుల వేదిక’ రద్దు చేసినట్లు చెప్పారు. దీపావళి పండుగ దృష్ట్యా సోమవారం జరగాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేశామని అన్నారు.

Similar News

News October 19, 2025

ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాధాన్యత: కేంద్రమంత్రి

image

గార మండలం శ్రీకూర్మం గ్రామంలో ఉన్న శ్రీకూర్మనాథుని ఆలయంతో పాటు కూర్మ గుండం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యేలు గొండు శంకర్, అతిధి గజపతిరాజుతో కలిసి కూర్మ గుండాన్ని పరిశీలించారు. శ్రీకూర్మంలో రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

News October 19, 2025

బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరూ ఇన్‌స్టా పోస్టు ద్వారా తెలియజేశారు. ‘చివరకు మా బేబీ బాయ్ వచ్చేశాడు. మా హృదయాలు నిండిపోయాయి. ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి. కృతజ్ఞతలతో పరిణీతి, రాఘవ్’ అని రాసుకొచ్చారు. 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

News October 19, 2025

కృష్ణా: కార్తీకమాసానికి ఆలయాలు ముస్తాబు

image

కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. హిందువులు నియమనిష్టలతో ఆచరించే ఈ మాసంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలకు ఆలయ నిర్వాహకులు సర్వసన్నద్ధమవుతున్నారు. కార్తీకంలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల సూచన.