News February 27, 2026

రేపు అలిపిరికి రానున్న ఆర్కియాలజీ బృందం

image

శిథిలావస్థలో ఉన్న అలిపిరి సమీపంలోని పురాతన మండపాన్ని ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల తొలగించారు. టీటీడీ దాతల సహకారంతో నిర్మించనున్న ఈ మండపం పనుల తనిఖీ కోసం సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులు శనివారం రానున్నారు. పునర్నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. తొలగింపులో తీసిన రాళ్లను ఏలా భద్రపరిచారనే విషయాలతో పాటు పలు సూచనలు చేసే అవకాశం ఉంది.

Similar News

News March 1, 2026

‘శాంతి కలుగుగాక’.. ఖమేనీ X అకౌంట్ నుంచి పోస్ట్!

image

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన X అకౌంట్స్‌లో ఒకదానిలో పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘అతనికి శాంతి కలుగుగాక’ అని అర్థం వచ్చే పర్షియన్‌ టెక్ట్స్‌తో పాటు ఓ యోధుడు ఖడ్గం పట్టిన ఇమేజ్ పోస్ట్ చేశారు. దీంతో ఇది ఖమేనీ మరణ వార్తను ఉద్దేశించి చేసిందేనని.. పరోక్షంగా కన్ఫామ్ చేసినట్టేనేనంటూ వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇరాన్ ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

News March 1, 2026

ఖమేనీ చనిపోయారు: ట్రంప్

image

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా పేర్కొన్నారు. ఈ చావుతో ఇరాన్ పౌరులతో పాటు అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందన్నారు. తమ నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని అన్నారు. ఇరాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడి పౌరులకు ఇది అతిపెద్ద అవకాశమన్న ట్రంప్.. దాడులు మరో వారం కొనసాగుతాయన్నారు.

News March 1, 2026

ఏలూరు: కార్మిక శాఖ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏలూరు జిల్లాలో 18 ఏళ్లు నిండిన కార్మికులు వివాహ కానుక, ప్రసూతి ప్రయోజన, సహజ మరణ ఉపశమన, అంత్యక్రియల వ్యయ సహాయ పథకాలకు దరఖాస్తు చేయాలని ఉప కార్మిక డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే ఈ పథకాలను నమోదు చేసుకున్న కార్మికులు వివరాలను (నవీకరణ) అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా లేబర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.