News February 28, 2025
రేపు ఆదిలాబాద్‌కు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి..

ఆదిలాబాద్‌లో శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకా యారా పర్యటించనున్నారు. జిల్లా కోర్టులో డిస్పెన్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. ఉ. 10.30 జిల్లా కోర్టుకు రానున్నారు. అనంతరం మరుసటి రోజు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
Similar News
News September 13, 2025
ఆదిలాబాద్‌కు కాస్త ఊరట.. మళ్లీ భారీ వర్షాలు

ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 22.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో జల్లులు మాత్రమే కురిశాయి. ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
News September 13, 2025
ADB: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత పేర్కొన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ ఉర్దూ మీడియంలో 17, ఇంగ్లీష్ మీడియంలో 49, తెలుగు మీడియంలో 56, ఫిజికల్ సైన్సెస్‌లో 20 సీట్లు ఉన్నట్లు తెలిపారు.
News September 12, 2025
ADB: ‘ఎన్నికల హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలి’

మధ్యాహ్న భోజన పథకం బిల్లుల నిర్వహణను యుకుబేర్ నుంచి మినహాయించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ సీఐటీయూ ఆఫీస్‌లో మాట్లాడారు. కార్మికుల పెండింగ్ బిల్లులతోపాటు వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం కార్మికులకు పదివేల వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు.