News March 3, 2026

రేపు ఆన్‌లైన్ క్విజ్: డీఈవో నాగేశ్వరరావు

image

జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని డీఈఓ నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. 22 మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రతిభ కనబరిచిన ఆరు టీములు ఈ నెల 6న జరిగే జిల్లా స్థాయి ఫైనల్స్‌కు ఎంపికవుతాయని ఆయన వెల్లడించారు.

Similar News

News March 6, 2026

కామారెడ్డి: కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి

image

కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు వినతిపత్రం అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో సొంత పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే స్థలం కేటాయించి సహకరించాలని వారు కలెక్టర్‌ను కోరారు.

News March 6, 2026

రేపు సీతంపేట ఐటీడీఏలో జిల్లా కలెక్టర్ పర్యటన

image

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి శనివారం సీతంపేట ఐటీడీఏలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ గార్డెన్, ఇప్పకూడ గ్రామంలో ముస్తాబు కార్యక్రమం, జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్‌ను కలెక్టర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఐటీడీఏ సిబ్బంది పేర్కొన్నారు.

News March 6, 2026

22ఏ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించండి: కలెక్టర్

image

జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో 229 విజ్ఞప్తులు వచ్చాయని వాటిలో 18 మాత్రమే పరిష్కరించడం జరిగిందని,10 కేసులు రిజెక్ట్ అయ్యాయన్నారు. 2249 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయవలసి ఉండగా, 2184 పంపిణీ చేశారన్నారు.