News November 20, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, NOV 24 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Similar News
News November 20, 2025
ఎదురుపడ్డా పలకరించుకోని జగన్-సునీత!

అక్రమ ఆస్తుల కేసులో AP మాజీ సీఎం జగన్ ఇవాళ HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులోనే ఉన్నారు. తన తండ్రి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ వాదనల నేపథ్యంలో ఆమె న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో అన్నాచెల్లెళ్లు ఎదురు పడినా ఒకరినొకరు పలకరించుకోలేదని, ఎవరో తెలియనట్లు వ్యవహరించినట్లు సమాచారం.
News November 20, 2025
ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రానికి స్థలం: CM

TG: ఈశాన్య రాష్ట్రాలతో సత్సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. HYDలో జరిగిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని ప్రకటించారు. TG సోదరుడు త్రిపుర గవర్నర్(ఇంద్రసేనా రెడ్డి)గా, త్రిపుర సోదరుడు TG గవర్నర్‌గా పనిచేస్తున్నారని CM అన్నారు.