News January 11, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Similar News
News January 23, 2026
V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
News January 23, 2026
ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.
News January 23, 2026
ఒక్క బంతికే 11 రన్స్

NZతో రెండో టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగారు. ఫౌల్క్స్ వేసిన మూడో ఓవర్లో 22 రన్స్ బాదారు. ఎక్స్‌ట్రాలతో కలిపి ఆ ఓవర్లో మొత్తం 24 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ తొలి బంతి ఫోర్ వెళ్లగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. తర్వాత బౌలర్ 2 వైడ్లు వేశారు. ఆ తర్వాత బాల్ ఫోర్ వెళ్లింది. దీంతో ఒక్క బంతికే 11 రన్స్ (4+nb+wd+wd+4) వచ్చినట్లయింది.


