News February 22, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు 8.30am – ఎల్లుండి 8.30am మధ్య వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, NLG, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, హనుమకొండ, జనగామ, SDPT, యాదాద్రి, భువనగిరి, RR, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News February 25, 2026
‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై CJI అభ్యంతరం

NCERT 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో <<19224324>>‘న్యాయవ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై CJI జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుమోటోగా విచారణ చేపడతామన్నారు. ‘ఇది జుడీషియరీపై ఒక ప్రణాళికబద్ధమైన దాడిగా కనిపిస్తోంది. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకు అనుమతించబోం. ఆ కంటెంట్‌పై న్యాయమూర్తులు కలవరపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
News February 25, 2026
మనీ ప్లానింగ్ లేకపోతే ఇబ్బందులు తప్పవు: తమన్నా

కెరీర్ ఆరంభంలో తన ఆర్థిక వ్యవహారాలను తండ్రే చూసుకునేవారని హీరోయిన్ తమన్నా వెల్లడించారు. ఆయన నుంచే ఆర్థిక ప్రణాళికలు నేర్చుకొని రియల్ ఎస్టేట్, ఆభరణాలు, ఇతర మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ‘ఇండస్ట్రీలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. యాక్టర్లు చాలా డబ్బు సంపాదిస్తారు. అంతే త్వరగా కోల్పోతారు. అందుకే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News February 25, 2026
‘మామ్స్ బ్రెయిన్’ అంటే ఏమిటి?

సాధారణంగా ప్రసవం తర్వాత కొందరు మహిళలు మతిమరుపునకు లోనవుతుంటారు. దీన్నే”మామ్స్ బ్రెయిన్” అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. డెలివరీ తర్వాత బిడ్డ సంరక్షణలో పడి పోషకాహారం తీసుకోవడం మానేస్తారు. బాలింతలు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల బాలింతలు ఆరోగ్యంగా ఉండి మతిమరుపు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చు.


