News February 26, 2025

రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్: కలెక్టర్

image

నల్గొండ – ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలలో 752 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని పేర్కొన్నారు.19 మంది పోటీలో ఉండగా నల్గొండ జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News November 4, 2025

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం

image

రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు షేక్‌పేట్ డివిజన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కార్నర్‌ మీటింగ్‌కు హాజరవనున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌ షోతోపాటు కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.

దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ‘రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు, 18-45 ఏళ్లలోపు వయసు, 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు.