News March 22, 2025
రేపు ఉప్పల్‌లో SRH VS RR.. ఇవి నిషేధం!

⊘కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు
⊘కత్తులు, గన్నులు, మారణాయుధాలు
⊘టపాసులు, సిగరెట్, అగ్గిపెట్టె, లైటర్
⊘మద్యపానం, కూల్‌డ్రింక్స్, బయటి ఆహార పదార్థాలు
⊘పెంపుడు జంతువులు
⊘హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్
⊘హెల్‌మెట్, బైనాక్యులర్ స్టేడియం లోపలికి తీసుకురావొద్దని <<15844156>>రాచకొండ<<>> పోలీసులు హెచ్చరిస్తున్నారు.
SHARE IT
Similar News
News March 24, 2025
HYD: రూ.5లక్షలు కాజేసిన సుడో పోలీసులు

HYD: బోయినపల్లిలో సుడో పోలీసు డబ్బులు కాజేశాడు. రాత్రి సమయంలో వాహనం తనిఖీ చేయలంటూ ద్విచక్ర వాహనదారుడిని సూడో పోలీసులు ఆపారు. పోలీస్ డ్రెస్‌లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీ చేశారు. వాహణదారుడి దగ్గర రూ. 5లక్షల బ్యాగు ఉండటం చూసి వివరాలు అడిగారు. పోలీస్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పి డబ్బులు తీసుకవెళ్లలంటూ బ్యాగుతో పరారీ అయ్యారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
News March 24, 2025
నగరంలో విద్యుత్ స్తంభాల లెక్క ఇక పక్కా

మహానగరంలో విద్యుత్ స్తంభాలు అసలు ఎన్ని ఉన్నాయో మనకే కాదు విద్యుత్ అధికారులకు కూడా అంతుపట్టదు. ఇక కరెంటు సమస్యలు వచ్చినప్పుడు ఏ పోల్‌లో సమస్య వచ్చిందో కనుగొనడం కష్టమవుతోంది. దీంతో స్తంభాల వివరాలను పక్కాగా లెక్కించనున్నారు. ప్రతి పోల్‌కు ఒక ఐడీ, క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్‌తో ఆ స్తంభం చరిత్ర మొత్తం తెలిసేలా సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు.
News March 24, 2025
ఖైరతాబాద్: కారు కడిగితే రూ.10,000 కట్టాల్సిందేనా..?

అదేంటి మా కారు మేము కడిగితే రూ.10వేలు ఎందుకు కట్టాలి అని అనుకుంటారు. మీరు కాదులెండి. జలమండలి సరఫరా చేసే నీటితో విచ్చలవిడిగా కార్లు కడిగిన వారికి ఈ భారీ జరిమానా విధించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సరఫరా చేస్తున్న నీటిని విచ్చలవిడిగా వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయినా మంచినీటితో కారును ఎందుకు కడగాలి? అనేది మనం ఆలోచించాలి.