News March 26, 2025

రేపు ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే!

image

రేపు ఉప్పల్ వేదికగా SRH VS LSG మ్యాచ్ కోసం TGSRTC స్పెషల్ బస్సులను నడుపుతోంది. 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను స్టేడియానికి తిప్పనున్నారు. ఉప్పల్, చెంగిచెర్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, విధాని, బర్కత్‌పురా, కాచిగూడ, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మేడ్చల్, మియాపూర్, కంటోన్మెంట్, హఫీజ్‌పేట, రాణిగంజ్, ఫలక్‌నుమా, మెహదీపట్నం, HCU తదితర డిపోల బస్‌లు అందుబాటులో ఉంటాయి.
SHARE IT

Similar News

News February 21, 2026

మెదక్: మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్‌ల జారీ కోసం నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC)లో సభ్యత్వం పొందేందుకు జీఓ 252 ప్రకారం జిల్లాలోని మీడియా అసోసియేషన్లు, సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఈనెల 23న ఉదయం 11 గంటలలోపు అందజేయాలని సూచించారు.

News February 21, 2026

నిర్మల్: ఆమె చేతికే పాలన పగ్గాలు..!

image

నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం 80 వార్డులకు గాను ఏకంగా 43 చోట్ల మహిళలు విజయం సాధించగా, 37 మంది పురుషులు ఎన్నికయ్యారు. నిర్మల్ మున్సిపల్ పీఠం మహిళకే దక్కగా, భైంసా, ఖానాపూర్ స్థానాలు జనరల్‌కు కేటాయించారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. పాలనలో మహిళలు కీలక పాత్ర పోషించనున్నారు.

News February 21, 2026

విశాఖ కేజీహెచ్‌లో కలకలం.. కుళ్లిన పసికందు మృతదేహం లభ్యం

image

కేజీహెచ్‌లో మరోసారి కలకలం రేగింది. శనివారం సూపరింటెండెంట్ కార్యాలయం పక్కన కుళ్లిపోయిన పసికందు మృతదేహం కనబడటంతో ఉద్యోగులు, రోగులు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కేజీహెచ్ సిబ్బంది పసికందు మృతదేహం గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.