News October 19, 2024

రేపు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు

image

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ రైతు భరోసా నిధులు ఎగ్గొట్టడంపై నిరసనగా బీఆర్‌‌ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలని శ్రేణులకు కేటీఆర్ సూచనలు చేశారు.

Similar News

News February 13, 2026

దేవరకద్ర పురపాలికలో తొలి విజయం

image

దేవరకద్ర పురపాలికల్లో ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. 12వ డివిజన్‌లో యుగేందర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 157 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ నాయకులలో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.

News February 13, 2026

MBNR: 41 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు!

image

మహబూబ్ నగర్ జిల్లాలోని 81 డివిజన్ల మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు 41 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇందులో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కోసం 30, దేవరకద్రకు 6, భూత్పూర్ మున్సిపాలిటీకి 5 టేబుళ్లను కేటాయించారు. మొత్తం 185 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.

News February 13, 2026

నేడే మహబూబ్‌నగర్ కౌంటింగ్!

image

మహబూబ్‌నగర్ కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పాలమూరు వర్సిటీలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత బ్యాలెట్ పేపర్లను బండిల్స్ చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.