News November 14, 2024
రేపు ఎడపల్లి మండలానికి మంత్రి జూపల్లి రాక

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో రేపు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి జూపల్లి పర్యటన ఎడపల్లి మండలంలో సైతం ఉండనున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సొసైటీ ఛైర్మన్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News October 31, 2025
NZB: కల్వల మత్తడి మరమ్మతులు వెంటనే చేపట్టాలి: కవిత

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి మరమ్మతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టును ఆమె శుక్రవారం సందర్శించారు. మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్లు అవుతోందన్నారు. మరమ్మతులకు గత ప్రభుత్వమే రూ.70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు బాగు చేయించలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.
News October 31, 2025
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కవిత

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన,బూజు పట్టిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలన్నారు.
News October 31, 2025
ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి: కవిత

భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలని ఆమె కోరారు. ఎకరాకు రూ.10 వేల సాయం సరిపోదని, ఒక్కో ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కవిత ట్వీట్ చేశారు.


