News August 16, 2025

రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండండి: వరంగల్ కలెక్టర్

image

ఈ నెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. వాగులు, వంకల సమీపంలో ఉన్న ప్రమాదకరమైన రోడ్లపై ప్రజలను అప్రమత్తం చేయాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

Similar News

News August 16, 2025

వరంగల్ జిల్లాలో 40 మి.మీ వర్షపాతం నమోదు

image

వరంగల్ జిల్లాలో గత 24 గంటలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో 40.0 మి.మీ వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 114.8 మి.మీ, దుగ్గొండిలో 99.5 మి.మీ, నర్సంపేటలో 61.8 మి.మీ, సంగెంలో తక్కువగా 12.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News August 15, 2025

వరంగల్ జిల్లా వర్షపాతం వివరాలు

image

జిల్లాలో సగటు 18.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖానాపూర్ మండలంలో 76.8 మి.మీ వర్షం కురిసింది. వర్ధన్నపేటలో 41.5 మి.మీ, పర్వతగిరి 30.1 మి.మీ వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేట, రాయపర్తి, నెక్కొండ మండలాల్లో 20 మి.మీ.కు పైగా వాన పడింది. జిల్లా మొత్తం వర్షపాతం 238.2 మి.మీ.గా నమోదైంది. కొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి.

News August 14, 2025

నియంత్రణలో సీజనల్ వ్యాధులు: డీఎంఅండ్‌హెచ్‌ఓ

image

జిల్లాలో సీజనల్ వ్యాధులు నియంత్రణలో ఉన్నాయని డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు మలేరియా 7, డెంగ్యూ 54 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రి ప్రజలకు ప్రాణదాతగా నిలుస్తోందని ప్రత్యేక అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.