News January 14, 2026
రేపు, ఎల్లుండి విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, విదర్భ, కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. నిన్నటి క్వార్టర్‌ఫైనల్లో పంజాబ్ 183 పరుగుల తేడాతో MPపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో విదర్భ 76 పరుగులతో ఢిల్లీని ఓడించింది. దీంతో రేపు జరిగే సెమీఫైనల్లో విదర్భ-కర్ణాటక తలపడనుండగా, ఎల్లుండి పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమ్‌లు 18న ఫైనల్లో తలపడనున్నాయి.
Similar News
News February 19, 2026
ఢిల్లీ AI సమ్మిట్‌లో బిల్ గేట్స్ స్పీచ్ రద్దు

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో బిల్ గేట్స్ ప్రసంగం రద్దయినట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. వివాదాల దృష్ట్యా సదస్సు ప్రాధాన్యం దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించనున్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో బిల్ గేట్స్ పేరున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆయన నుంచి దూరం పాటిస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
News February 19, 2026
అష్టలక్ష్మి: ధాన్యలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలంటే?

ధాన్యలక్ష్మి దేవి ఆరాధనలో నీలవర్ణం వస్త్రం ఉంచి, పచ్చని పూలతో పూజ చేయాలి. ధాన్యలక్ష్మి వ్యవసాయానికి, ఆహారానికి అధిదేవత. పచ్చని పూలు ప్రకృతికి, జీవకళకు సంకేతం. మనింట్లో ఎప్పుడూ ఆహారానికి లోటు లేకుండా ఉండాలని ఈ దేవిని ప్రార్థిస్తారు. నీలవర్ణం అనంత ఆకాశాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతిలో పూజించడం వల్ల రైతులు పంటలు బాగా పండుతాయని, సాధారణ ప్రజలు ఆకలి బాధలు లేకుండా సుభిక్షంగా ఉంటారని నమ్మకం.
News February 19, 2026
నువ్వుల సాగు.. కాండంకుళ్లు తెగులు నివారణ

కాండంకుళ్లు తెగులు ఆశించిన నువ్వుల పంట కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేర్లను చీల్చితే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోయి, చనిపోతాయి. అధిక తేమ పరిస్థితులు ఉన్నప్పుడు కాండంకుళ్లు తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


