News May 9, 2024

రేపు ఒంగోలుకు రానున్న చంద్రబాబు

image

TDP అధినేత నారా చంద్రబాబు రేపు ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆయన ఒంగోలుకు చేరుకుంటారు. అనంతరం నగరంలో రోడ్ షో నిర్వహించి, రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 11వ తేదీ ఉదయం చిత్తూరు జిల్లా, పూతలపట్టుకు వెళ్తారు. దీంతో దామచర్ల జనార్దన్‌కు సమాచారం అందగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొదటగా చంద్రబాబు 11వ తేదీ ఒంగోలుకు రావాలి. కానీ ఆయన పర్యటన ఒక రోజు ముందుకు మారింది.

Similar News

News July 11, 2025

ఒంగోలు: రూ.20వేల సాయం.. 2రోజులే గడువు

image

కేంద్రం సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇవ్వనుంది. జిల్లాలో 4.38లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా రూ.2.72లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులోనూ కొందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే ఇంకా ఎవరైనా అర్హులుగా ఉంటే ఈనెల 13వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు

News July 11, 2025

ఒంగోలుకు రావడానికి ఇబ్బందులు..!

image

ప్రకాశం జిల్లాలోని పలు పల్లెల నుంచి ఒంగోలు రావడానికి సరైన సమయాల్లో బస్సులు లేవు. ఉదయం వేళలో స్కూల్‌, కాలేజీకి వెళ్లే విద్యార్థులు సైతం బస్సుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఉదయాన్నే 6 గంటలకు బస్సులు వస్తున్నాయి. ఆ తర్వాత 10పైనే బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. 8 గంటల ప్రాంతంలో బస్సులు తిప్పాలని పలువురు కోరుతున్నారు. మీ ఊరికి ఇలాగే బస్సు సమస్య ఉంటే కామెంట్ చేయండి.

News July 10, 2025

కనిగిరి: జనసేనలో చేరిన దేవకి వెంకటేశ్వర్లు

image

కనిగిరికి చెందిన జాతీయ వాసవి సత్ర సముదాయాల ఛైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వెంకటేశ్వర్లకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరి కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల వైసీపీకి వెంకటేశ్వర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.