News August 28, 2025

రేపు కరీంనగర్ డ్యాం గేట్లు తెరిచే అవకాశం

image

కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిడ్ మానేరు నుంచి వరద లోయర్ మానేరు డ్యాంలోకి వస్తుందని, రేపు 10 గంటల వరకు స్పిల్వే వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని తెలిపారు. నది దిగువన గుండా పరిసర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానేరు నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

Similar News

News August 28, 2025

KNR: ‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

image

కరీంనగర్ లోని లోయర్ మానేరు జలాశయాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గురువారం సందర్శించారు. డ్యాములోకి వస్తున్న వరద ప్రవాహం వివరాలు తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని కుంటలు, చెరువుల పరిస్థితిని ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News August 28, 2025

కరీంనగర్: కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల నియామకం

image

TG యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా నూతన కోఆర్డినేటర్ నియామకం గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా కడారి కుమార్, ముక్కెర సతీష్ కుమార్ లు నియామకమయ్యారు. అదేవిధంగా మల్లికార్జున్, ప్రశాంత్ లను కో-కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరితో పాటు 6 అసెంబ్లీ కోఆర్డినేటర్లను నూతనంగా ఎంపిక చేశారు. స్థానిక సంస్థల విజయం కోసం పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్రచారంలో నియామకాలు జరిగాయి.

News August 27, 2025

కరీంనగర్: ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం

image

KNR బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆర్టీసీలో 2024-25 ఆర్థిక సం.కి సంబంధించి 4వ త్రైమాసికంలో, 2025-26 ఆర్థిక సం.మొదటి త్రైమాసికంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం చేశారు. ఇందులో భాగంగా రెండు త్రైమాసికాలకు గాను 57మంది ఉద్యోగులు, 2 బస్ స్టేషన్లకు అవార్డులు ప్రదానం చేశారు. KNR RM బి.రాజు, డిప్యూటీ RMలు ఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం ఉద్యోగులకు అవార్డులు అందించారు.