News November 17, 2025

రేపు కర్నూలులో ట్రైలర్ రిలీజ్

image

హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌‌కు అభిమానుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రేపు కర్నూలులో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నగరంలో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ ఫ్యాన్స్ మధ్య ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. 27న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

Similar News

News November 17, 2025

బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్

image

‘ఎమోజీ’ వివాదం ముదరడంతో హీరో బాలకృష్ణకు TG హోంశాఖ స్పెషల్ CS సీవీ ఆనంద్ క్షమాపణ చెప్పారు. 2 నెలల కిందట పైరసీ, బెట్టింగ్ యాప్‌ల విషయంపై టాలీవుడ్ ప్రముఖులతో ఆనంద్ సమావేశం నిర్వహించి Xలో ఓ పోస్టు చేశారు. అయితే ఈ భేటీకి బాలయ్యను ఎందుకు పిలవలేదని ఓ వ్యక్తి ప్రశ్నించగా, ఆనంద్ X ఖాతాను హ్యాండిల్ చేసే వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన పోస్టును తొలగించి సారీ చెప్పారు.

News November 17, 2025

NGKL: చివరి కార్తిక సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

image

చివరి కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి, సందడి వాతావరణం నెలకొంది.

News November 17, 2025

కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వణికిపోతున్న హైదరాబాదీలు

image

హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. మారేడుపల్లిలో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 11.2℃గా నమోదైంది. అటు బహదూర్‌పుర, బండ్లగూడ, చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్ 13.2, తిరుమలగిరి 13.6, గోల్కొండ, ముషీరాబాద్ 14.4, షేక్‌పేట్ 15.2, అమీర్‌పేట్, ఖైరతాబాద్ 15.6, సికింద్రాబాద్లో 16℃గా నమోదైంది.