News February 9, 2025
రేపు కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

నంద్యాలలోని కలెక్టరేట్లో ఈనెల 10వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా తమ సమస్యలపై అర్జీలు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News January 3, 2026
ఏలూరు జిల్లా కస్తూర్బా స్కూళ్లలో ఉద్యోగాలు

కాకినాడ జిల్లాలో 2 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్ – 3 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి జనవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. టెన్త్ పాసైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
ఇంద్రకీలాద్రిపై ఆరుద్రోత్సవ పూజలు

ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరిగే నటరాజస్వామి ఆరుద్రోత్సవ కళ్యాణ ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 1954లో నిర్మించిన ఈ ఆలయం, చిదంబరం ఆలయం తరహాలో చంద్రశిలలతో విగ్రహాలను కలిగి ఉంది. ఈ పూజల్లో ఆలయ కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్, నటరాజస్వామి ఆలయ నిర్మాణదాతలు చెన్నాప్రగఢ కోటంరాజు వంశీకులు నాగేశ్వరి దంపతులు, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, పాల్గొన్నారు.
News January 3, 2026
తిరుపతి: KGBVలో 31 ఉద్యోగాలకు నోటిఫికేషన్

జిల్లాలోని KGBVలో 31 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. వార్డెన్-3, పార్ట్‌టైం టీచర్లు-4, చౌకిదార్-4, హెడ్ కుక్-4, అసిస్టెంట్ కుక్-8 పోస్టులకు అవకాశం ఉంది. వీటితోపాటు పార్ట్ టైం టీచర్లు-3, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు-2, ANM-1, అకౌంటెంట్-1, అసిస్టెంట్ కుక్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.


