News March 29, 2025
రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు

ఉగాది ఉత్సవాలను ఆదివారం ఉదయం గం.10.30ల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎపీహెచ్‌ఆర్‌డీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 4, 2025
సిరిసిల్ల: కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్

వేములవాడ పరిధి చిన్న బోనాల గురుకుల పాఠశాలలో జరుగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియను సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మంగళవారం పరిశీలించారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీలకు కౌన్సెలింగ్ నిర్వహించిన సందర్భంగా ఆమె ఇన్స్పెక్ట్ చేశారు. విద్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ డెస్కులు, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News November 4, 2025
ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళిలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలగాలన్నారు.
News November 4, 2025
నాతవరం మండలంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు మంగళవారం తెలిపారు. సరుగుడు పంచాయతీ అచ్చంపేటకు చెందిన కోసూరు పెదరాయుడు కోటనందూరు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మండలంలోని కృష్ణాపురం అచ్చంపేట గ్రామాల మధ్యలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న పెదరాయుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ చెప్పారు.


