News January 4, 2026

రేపు కాకినాడకు ఎంపీ పురంధేశ్వరి, నటుడు కళ్యాణ్ రామ్

image

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ సోమవారం కాకినాడ విచ్చేస్తున్నారు. నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 10 గంటలకు రానున్న వారికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖుల రాకతో కాకినాడలో సందడి నెలకొంది. పార్టీ శ్రేణులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Similar News

News February 25, 2026

SBIలో 116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

image

SBI 116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(AVP, డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc/BE/BTech, BCA/MCA, M.Tech, MSc, CA, ICAI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News February 25, 2026

భద్రత కల్పించాలన్న కాటసాని పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

image

తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం పోలీసు భద్రతనేది హోదాగా మారిందని, దానికి ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని CJI ధర్మాసనం కాటసాని లాయర్‌ను ప్రశ్నించింది. శక్తిమంతులైన మీరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మీకు ముప్పు ఉంటే నిఘా వ్యవస్థలు అంచనా వేస్తాయని పేర్కొంది.

News February 25, 2026

పేరు మారిన రాష్ట్రాలు

image

☛ కేరళం-కేరళ, ట్రావెన్‌కోర్ కొచ్చిన్, ☛ ఆంధ్రప్రదేశ్-ఆంధ్ర రాష్ట్రం, ☛ తెలంగాణ- హైదరాబాద్ స్టేట్ ☛ మహారాష్ట్ర-బాంబే స్టేట్, ☛ గుజరాత్-బాంబే స్టేట్, ☛హిమాచల్ ప్రదేశ్-ఈస్ట్ పంజాబ్, ☛ పంజాబ్- ఈస్ట్ పంజాబ్ ☛ కర్ణాటక- మైసూర్ స్టేట్, ☛ ఒడిశా- ఒరిస్సా, ☛ తమిళనాడు- మద్రాస్ స్టేట్, ☛ఉత్తరాఖండ్- ఉత్తరాంచల్, ☛ఉత్తరప్రదేశ్- యునైటెడ్ ప్రావిన్సెస్, ☛మధ్యప్రదేశ్- మధ్య భారత్