News December 27, 2024
రేపు కాకినాడకు రానున్న సినీ నటులు

ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేశ్ శనివారం కాకినాడలో ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఉత్సవంలో పాల్గొననున్నారు. పీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో వెంకటేశ్‌తోపాటు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, ఆమని, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి పాల్గొననున్నారు. సినీ నటుల రాక కోసం స్థానికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 11, 2025
తూ.గో. కలెక్టర్‌కు 13వ ర్యాంకు

సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి IAS 711 ఫైళ్లు స్వీకరించి, 680 ఫైళ్లను పరిష్కరించారు. ఆమె సగటు ప్రతిస్పందన సమయం 1 రోజు 21 గంటల 12 నిమిషాలుగా ఉంది. ఈమె పనితీరు ఆధారంగా ఆమెకు 13వ ర్యాంకు కేటాయించారు.
News December 10, 2025
ధాన్యం కొనుగోలులో పారదర్శకత అవసరం: జేసీ

ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, రవాణా, కొలతలు, చెల్లింపులు వంటి అన్ని అంశాల్లో పారదర్శకత ఉండాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని.. ప్రతి సమాచారం రైతులకు, మీడియాకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
News December 10, 2025
రాజమండ్రి: విద్యాభివృద్ధిలో తరగతి పరిశీలన కీలకం- DEO

పాఠశాల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో దోహదపడే తరగతి పరిశీలన చిత్తశుద్ధితో నిర్వహించాలని DEO కె.వాసుదేవరావు సూచించారు. గత 2రోజులుగా స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న సీఆర్‌ఎంటీలు, ఉపాధ్యాయుల “టీచ్ టూల్ అబ్జర్వేషన్ శిక్షణ” తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.


