News February 19, 2025

రేపు కాగజ్ నగర్‌కు మంత్రి సీతక్క

image

రేపు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాగజ్‌నగర్‌లో పర్యటిస్తారని ఎమ్మెల్సీ దండే విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని, ఈ సమావేశానికి పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని అన్నారు.

Similar News

News July 6, 2025

రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

image

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

News July 6, 2025

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8గంటల వరకు 38.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహదేవ్‌పూర్ 3.8, మల్హర్‌రావు 11.2, మొగుళ్లపల్లి 6.2, రేగొండ 2.4, ఘన్‌పూర్ 13.4, భూపాలపల్లి 1.0 మి.మీటర్ల వర్షం నమోదైంది.

News July 6, 2025

ఆప్షనల్ సెలవులు స్కూళ్లకు కాదు: పాఠశాల విద్యాశాఖ

image

AP: ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇవి స్కూలు మొత్తానికి ఇచ్చేందుకు కాదని చెప్పారు. అటు ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఎవరైనా ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ బడుల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.