News August 18, 2024

రేపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా పర్యటన

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో 11వ జూనియర్ అంతర జిల్లాల సాఫ్ట్-బాల్‌ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కోటబొమ్మాళి మండలం తాటిపర్తి గ్రామంలో మెండ భాస్కరరావు వర్ధంతి సభలో పాల్గొంటారు.

Similar News

News July 6, 2025

శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీకి చెందిన పడాల. నారాయణ రావు(84) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుదీర్ పర్యవేక్షణలో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News July 6, 2025

శ్రీకాకుళం: ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్ మీటింగ్

image

మెగా టీచర్ పేరెంట్ మీటింగ్‌ను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని వారికి సూచించారు. కలెక్టర్ చాంబర్‌లో శనివారం ఆయా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు.

News July 5, 2025

రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.