News March 2, 2026
రేపు కోటప్పకొండ దేవాలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా ఈనెల 3న కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. గ్రహణం ముగిశాక ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులను తిరిగి అనుమతిస్తామని వెల్లడించారు. భక్తులు ఈ సమయ మార్పును గమనించాలని ఆలయ వర్గాలు కోరాయి.
Similar News
News March 2, 2026
నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్లకు టెన్త్ ప్రశ్నపత్రాలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండగా, వాటికి సంబంధించిన ప్రశ్నపత్రాలు జిల్లాకేంద్రానికి చేరుకున్నాయి. ఆదివారం పేపర్ -1 రాగా, సోమవారం కలెక్టరేట్ నుంచి పేపర్-1 ప్రశ్న పత్రాలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. జిల్లాలో 60 పరీక్షా కేంద్రాల్లో 10,658 మంది టెన్త్ పరీక్ష రాయనున్నట్లు డీఈవో రమేష్ కుమార్ తెలిపారు.
News March 2, 2026
రంగుల పండుగను శాంతియుతంగా జరుపుకోండి: కలెక్టర్

జగిత్యాల జిల్లా ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యత, స్నేహభావం పెంపొందించే పండుగ హోలీ అని పేర్కొన్నారు. ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. హానికర రసాయన రంగులు వాడకుండా సహజ రంగులతో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. నీటి వృథాను నివారిస్తూ, భద్రతా నియమాలు పాటించాలని, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
News March 2, 2026
నిర్మల్: రైతులకు 1,40,000 యూరియా బస్తాలు అందజేత

జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటివరకు రైతులు 1,60,000 వేల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా 1,40,000 బస్తాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.


