News March 5, 2026

రేపు ఖమ్మంలో జాబ్ మేళా

image

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ, మోడల్ కెరీర్ సెంటర్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో 322 ఖాళీల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టారు. ఫార్మసిస్ట్, సీఎస్‌ఏ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో ఉద్యోగంతో పాటు ఉచిత వసతి కల్పిస్తామని వెల్లడించారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.