News August 29, 2025
రేపు ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అమెరికన్ కాన్సులేట్

HYD ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం ఆగస్టు 30న HYD అమెరికన్ కాన్సులేట్ విలియమ్స్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి వద్ద భద్రతను అధికారులు తనిఖీ చేశారు. ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం తాను ఎంతగానో వేచి చూస్తున్నట్లుగా విలియమ్స్ తెలిపారు.
Similar News
News September 2, 2025
PGRSపై త్వరలో శిక్షణ: కలెక్టర్

CMO ఆదేశాల మేరకు త్వరలో PGRSకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. PGRSపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతినెలా విశ్లేషణ నిర్వహిస్తారని, అందువల్ల అధికారులంతా వచ్చిన వినతల పరిష్కారం పట్ల చిత్త శుద్ధి చూపించాలని ఆదేశించారు. అసలైన ఫిర్యాదుదారులకు న్యాయం చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.
News September 2, 2025
జగిత్యాల: జీతాలు విడుదల చేయాలని వినతి

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు విడుదల చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. 2025-26 సంవత్సరం మార్చ్ నుంచి ఆగస్టు నెల వరకు జీతాలను ఇంకా విడుదల చేయలేనందున ప్రభుత్వం స్పందించి జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పిటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
News September 2, 2025
IBM క్వాంటం కంప్యూటర్‌కు గ్రీన్ సిగ్నల్

AP: అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌లో IBM క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. చదరపు అడుగుకు రూ.30 అద్దె చెల్లించేలా IBMతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. IBM రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగేళ్లపాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్‌ను కేటాయించనుంది.