News April 25, 2024

రేపు గుంటూరుకు షర్మిల పర్యటన

image

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురువారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె నగరంలో రోడ్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు చేరుకోనున్న ఆమె సాయంత్రం సంజీవయ్యనగర్, రాజీవ్ గాంధీనగర్, శారదాకాలనీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 2, 2026

GNT: అంబటికి వైసీపీ నేతల పరామర్శ

image

అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్‌లకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు.

News March 1, 2026

అమరావతిలో పలు శంకుస్థాపనలు.. ప్రారంభాలు చేసిన CJI

image

అమరావతిలో ఏపీ హైకోర్టు అతిథి గృహానికి, జ్యూడిషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల సముదాయాలు ప్రారంభించారు. రూ.210 కోట్లతో 33.20 ఎకరాల్లో 36మంది జడ్జీలకు బంగ్లాలు నిర్మించారు. సీజేఐతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

News March 1, 2026

GNT: గ్యాస్ డెలివరీ బాయ్స్‌కి జాయింట్ కలెక్టర్ వార్నింగ్

image

గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు చేయడం ఆపాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం LPGడిస్టిబ్యూటర్లు, చౌకధరల దుకాణదారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. IVRSసర్వేలో రెండు ప్రశ్నలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు. వృద్దులకు ఇంటికి రేషన్ సరఫరా చేయకపోవడం కారణంగా కూడా వ్యతిరేకత వస్తుందన్నారు.