News June 17, 2024
రేపు గుంటూరు జిల్లాకు వర్ష సూచన

గుంటూరు జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. మరోవైపు, పొరుగున ఉన్న కృష్ణా జిల్లాలోనూ వర్షాలు పడతాయని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News November 7, 2025
వందేమాతర ఉద్యమంలో గుంటూరు పాత్ర

వందేమాతర నినాదం స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905–11మధ్య ‘వందేమాతర యుగం’గా ప్రసిద్ధి చెందింది. ఈ పోరాటం ఉధృతి గుంటూరు జిల్లాలో మహోజ్వలంగా కొనసాగింది. చేబ్రోలులోని రెడ్డిపాలెం రైతు చిన్నపరెడ్డి బ్రిటిష్ పోలీసు అధికారిపై తిరగబడ్డారు. తుపాకీతో తన ఎద్దును కాల్చడంతో ఆగ్రహించిన చిన్నపరెడ్డి, ఇతర రైతులతో కలిసి అధికారిని చితకబాదారు. ఈ నేరానికి ఆంగ్ల ప్రభుత్వం చిన్నపరెడ్డి సహా ముగ్గురికి ఉరిశిక్ష విధించింది.
News November 7, 2025
పెదనందిపాడు: ప్రభుత్వ ఆడిటర్ ఇంట్లో సీబీఐ సోదాలు

పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ఆడిటర్ గుమ్మడిల్లి శివ నాగేశ్వరరావు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారులు ఆయన ఇంట్లోనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాలు అధికారులు వెల్లడించిన తర్వాత తెలియనున్నాయి.
News November 7, 2025
దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు గురువారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.12,500, మోడల్ ధర రూ.12,500 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,800, గరిష్ఠ ధర రూ.12,400, మోడల్ ధర రూ.12,400 పలకగా, మొత్తం 218 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.


