News February 2, 2025
రేపు గ్రివెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పీజీఆర్ఎస్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు ఉదయం 9:30 గంటలకే పీజీఆర్ఎస్‌కు హాజరు కావాలని ఆదేశించారు.
Similar News
News December 27, 2025
MBNR: కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి సమీపంలో జిల్లా కోర్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ భూమిపూజ చేశారు. పండితులు వేదమంత్రాలు పఠిస్తూ కార్యక్రమం నిర్వహించారు. వారితోపాటు జిల్లా సెషన్ న్యాయమూర్తి ప్రేమలత, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి తదితరులు పాల్గొన్నారు.
News December 27, 2025
క్యాబేజీ సాగు – యాజమాన్య పద్ధతులు

శీతాకాలంలో సాగు చేసే పంటల్లో క్యాబేజీ ఒకటి. కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగుచేసి మంచి లాభాలు పొందవచ్చు. ఇసుకతో కూడిన బంక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం. వీటిలో దీర్ఘకాలిక రకాలను డిసెంబరు నెలాఖరు వరకు నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.
News December 27, 2025
శివాజీపై పోరాటం.. అనసూయకు ప్రకాశ్ రాజ్ మద్దతు

కొన్నిరోజులుగా శివాజీ-<<18671913>>అనసూయ<<>> మధ్య SM వేదికగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ‘సంస్కారులమని చెప్పుకునే వారిని మొరగనివ్వు. అది వాళ్ల కుంచిత మనస్తత్వం. మేమంతా నీతోనే ఉన్నాం’ అని ట్వీట్ చేశారు. MLC <<18683153>>నాగబాబు<<>> కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే. ‘మా బాబుగారు ఎప్పుడూ మావైపే’ అంటూ అనసూయ థాంక్స్ చెప్పారు.


