News March 15, 2025
రేపు జనగామ జిల్లాకు సీఎం రాక

జనగామ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లిలో సభకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News November 10, 2025
ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా

ఢిల్లీ <<18252218>>పేలుడు<<>> ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఘటన ఎలా జరిగిందనే కారణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
News November 10, 2025
VKB: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరచాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు. సాధారణ పరిశీలనలో భాగంగా పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
News November 10, 2025
JGTL: 80లక్షల MTల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యం

వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో 80 లక్షల MTల అంచనాతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. పంట కొనుగోళ్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం రైతులకు కమిట్మెంట్ ఇచ్చిందని, దానికనుగుణంగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.


