News December 21, 2025

రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్

image

విశాఖపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌‌ఎస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని చెప్పారు. నగర పౌరులు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేయటం ద్వారా సత్వర పరిష్కారం పొందువచ్చని పేర్కొన్నారు.

Similar News

News December 21, 2025

60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేసి సీపీ

image

విశాఖలో ఆదివారం జరుగుతున్న ఇండియా- శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 60 మంది స్వచ్చంధ సంస్థల బాలబాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి అవకాశం కల్పించారు. స్వచ్చంధ సంస్థలలో ఉంటున్న 60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సీపీ బాలబాలికలను స్టేడియంలో కలిసి ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.

News December 21, 2025

విశాఖ: 26 మంది వైసీపీ కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపు.. క్లారిటీ

image

GVMCలో కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై వైసీపీ చేసిన ఫిర్యాదును రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. విప్ ధిక్కరణకు సంబంధించి 26 మంది కార్పొరేటర్లకు నేరుగా నోటీసులు అందినట్లు ఆధారాలు లేవన్నారు. 26 మంది కార్పొరేటర్ల ఫిరాయింపుతో TDP మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నందని వైసీపీ ఏప్రిల్‌లో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది.కాగా 80వ వార్డు కార్పొరేటర్ నీలిమ విప్ ధిక్కరణ పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు.

News December 21, 2025

భవన శిథిలాలు రోడ్లు పక్కన పోస్తే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

విశాఖను కాలుష్య రహిత నగరంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షీణిస్తున్న గాలి నాణ్యతపై అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, చెత్తను కాల్చవద్దన్నారు. తొలగించిన భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ పోయివద్దని,రాత్రి సమయాల్లో అలాంటి వాహనాలపై నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేసి భవన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.