News September 19, 2025

రేపు జోగులాంబ ఆలయం మూసివేత

image

అలంపూర్‌లో వెలిసిన జోగులాంబ దేవి ఆలయాన్ని రేపు మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో దీప్తి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండటంతో ఆలయ శుద్ధి, పవిత్రోత్సవం నిర్వహణకు ఆలయాన్ని మూసివేస్తారని తెలిపారు. బాల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం యథావిధిగా ఉంటుందన్నారు. భక్తులు మార్పును గమనించి సహకరించాలని కోరారు.

Similar News

News September 19, 2025

తొలి రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

image

వాతావరణ మార్పులతో తొలి రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేల సమాచారం, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలో ఒత్తిడిని పెంచి, హార్మోన్లను ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.

News September 19, 2025

దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు KTR: మంత్రి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ వైపు అధికార పార్టీ, మరో వైపు ప్రతిపక్ష పార్టీ నువ్వానేనా అన్నచందంగా మాటల తూటాలు పేలుస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ‘KTR నువ్వో పిల్లబచ్చా..అసెంబ్లీ ఎన్నికల్లో కాదు దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు..అప్పటికి నువ్వు ఇండియాలో ఉంటవో విదేశాలకు చెక్కేస్తవో’అని అన్నారు. నోటిదూల KTRకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని Tకాంగ్రెస్ Xలో ట్వీట్ చేసింది.