News February 22, 2026

రేపు టీజీ పీజీఈసెట్- 2026 నోటిఫికేషన్

image

రాష్ట్రంలోని ఎం.టెక్, ఎం.ఫార్మసీ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఎన్టీయూ నేతృత్వంలో TG PGECET- 2026 నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. ఫిబ్రవరి 27న ఉ.11:30 గంటల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని కన్వీనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://pgecet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Similar News

News February 22, 2026

బుమ్రా, వరుణ్ సూపర్ రికార్డు

image

T20WC సూపర్-8లో SAతో మ్యాచ్‌లో బుమ్రా, వరుణ్ అరుదైన ఘనత సాధించారు. T20WCలో IND తరఫున అత్యధిక వికెట్లు(33) తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అర్ష్‌దీప్(32), అశ్విన్(32), హార్దిక్(29), జడేజా(22) ఉన్నారు. అలాగే IND తరఫున టీ20ల్లో వరుసగా అత్యధిక ఇన్నింగ్స్‌(18)లలో కనీసం ఒక వికెట్ తీసిన బౌలర్‌గా వరుణ్ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో అర్ష్‌దీప్(17), నెహ్రా(13), సుందర్(11) ఉన్నారు.

News February 22, 2026

వనపర్తి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రేపు స్పష్టత!

image

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఫిబ్రవరి 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పదో తరగతి పరీక్షలకు ముందే ఎన్నికలు నిర్వహించాలా లేదా అన్నది ఈ భేటీలో తేలనుంది. జిల్లాలో పెరిగిన స్థానాలతో కలిపి మొత్తం 133 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

News February 22, 2026

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

కృష్ణా : సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు
మచిలీపట్నంలో యువకుడు ఆత్మహత్య
కోడూరులో ఉపాధ్యాయుడి వినూత్న బోధన
కృష్ణా : ఫార్మసీ పరీక్షా ఫలితాలు విడుదల
కృష్ణా : తల్లిని చూసేందుకు వెళుతూ.. కొడుకు మృతి
గుడివాడ : ట్రైన్‌లో రూ.14 లక్షల గోల్డ్ బ్యాగ్ మిస్
విజయవాడలో రేపు ఎమ్మెల్యేలు, మంత్రులకు క్రీడా పోటీలు