News April 27, 2024

రేపు టెక్కలికి రానున్న YS షర్మిల

image

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల రేపు సాయంత్రం 4 గంటలకు టెక్కలి రానున్నట్లు జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డా. పేడాడ పరమేశ్వరరావు తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ కూడలి వద్ద జరిగే సమావేశంలో షర్మిల ప్రసంగిస్తారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె టెక్కలి, పలాసలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 24, 2025

శ్రీకాకుళం: రైల్వే ట్రాక్ దాటుతుండగా వ్యక్తి దుర్మరణం

image

శ్రీకాకుళం GRP పరిధి నెల్లిమర్ల- విజయనగరం మధ్యలో రైల్వే ట్రాక్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. తిరుచునాపల్లి నుంచి హౌరా వెళ్లే రైలు వస్తున్న సమయంలో రైల్వే ట్రాక్‌ను దాటుతుండడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతదేహాన్ని విజయనగరం మహారాజా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు.

News December 24, 2025

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి: మంత్రి అచ్చెన్న

image

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్న అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుడు చేసిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News December 24, 2025

రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.