News January 6, 2026
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై వినతి పత్రాలు ఇవ్వనున్నారు.
Similar News
News February 12, 2026
US, వెనిజులా ఆయిల్ కొనుగోళ్లు పెంచండి.. కేంద్రం ఆదేశం!

అమెరికా, వెనిజులా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు పెంచాలని IOC, BPCL, HPCL తదితర రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. ‘ట్రేడ్ డీల్‌లో భాగంగా ఎనర్జీ కొనుగోళ్లు పెంచాలని ఇండియా చూస్తోంది. రష్యా ఆయిల్ దిగుమతిని తగ్గించుకోనుంది. స్పాట్ మార్కెట్ టెండర్లలో US గ్రేడ్స్‌కు ప్రాధాన్యమివ్వాలని రిఫైనరీలను కోరింది. వెనిజులా ఆయిల్‌ను ట్రేడర్లతో ప్రైవేట్ చర్చల ద్వారా కొనాలని చెప్పింది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
News February 12, 2026
విటమిన్ Cతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

స్త్రీలకు విటమిన్ C ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇది సరిగ్గా లభించకపోతే స్త్రీలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. C విటమిన్‌తో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి, ప్రెగ్నెన్సీలో తీసుకుంటే శిశువులో పుట్టుకలోపాలు రాకుండా ఉంటాయి, ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల హార్మోన్ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉండవు. కాబట్టి ఇది తగినంత అందేలా చూసుకోవాలంటున్నారు.
News February 12, 2026
చేతులు, కాళ్లు కట్టేసి.. బంగ్లాలో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని మౌల్విబజార్‌లోని చంపా ప్రాంతంలో టీ తోటల్లో పని చేసే రతన్ సహువాకర్(28)గా గుర్తించారు. రతన్ చేతులు, కాళ్లు కట్టేశారని, శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో హత్య జరిగిందా, ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


