News January 17, 2026

రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

image

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.

Similar News

News February 20, 2026

16 శుక్రవారాల వ్రతం ఉద్యాపన విధానం

image

16 శుక్రవారాల వ్రతం పూర్తయ్యే చివరి వారంలో ‘ఉద్యాపన’ చేయాలి. ఆ రోజున 8 మంది బాలురను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. భోజనంలో పాయసం, పూరీ, బెల్లం, శనగలు వడ్డించాలి. భోజనంలో పులుపు ఉండకూడదు. భోజనం తర్వాత పిల్లలకు అరటిపండు, ప్రసాదం, దక్షిణ ఇవ్వాలి. పిల్లలు ఆ రోజున ఏ విధమైన పులుపు పదార్థాలు తినకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది. అమ్మవారి కృపతో ఆ ఇల్లు సుఖశాంతులతో నిండిపోతుంది.

News February 20, 2026

బంగారు మనసు.. 100గ్రా. గోల్డ్ తిరిగిచ్చేశాడు!

image

₹15 లక్షల విలువైన బంగారాన్ని తిరిగిచ్చి స్క్రాప్ డీలర్ నిజాయతీ చాటుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో అశోక్ శర్మ 2025లో కుంభమేళాకు వెళ్తూ 100G బంగారం పేపర్లో దాచి మరిచిపోయారు. దీపావళికి ఇల్లు క్లీన్ చేసి, పొరపాటున స్క్రాప్‌తో కలిపి అమ్మేశారు. తర్వాత స్క్రాప్‌ షాపులో వెతికినా బంగారం దొరకలేదు. ఈ క్రమంలో 4 నెలల తర్వాత షాప్ యజమాని అఖ్తర్ ఖాన్‌కు బంగారం కనిపించింది. పోలీసుల ద్వారా అశోక్‌కు అందజేశారు.

News February 20, 2026

అబద్ధాలు ట్రెండ్ కావచ్చు.. కానీ గెలిచేది నిజమే: లోకేశ్

image

AP: <<19166821>>హెరిటేజ్ ఫుడ్స్<<>> విషయంలో నిజం గెలిచిందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘హెరిటేజ్ సంస్థపై సాక్షి మీడియా చేసింది తప్పుడు ప్రచారమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. అబద్ధాలు ఒక రోజు ట్రెండ్ కావచ్చు. కానీ న్యాయ పరీక్షలో నిజమే గెలుస్తుంది. సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేశారు.