News February 21, 2026
రేపు దేవాదులకు సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు, తుపాకులగూడెం సమ్మక్క- సాగర్ బ్యారేజ్‌ను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ప్రాజెక్టుల పురోగతి, నీటి నిల్వలు, సాగునీటి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు.
Similar News
News February 27, 2026
నూకపల్లి న్యాక్ సెంటర్లో సర్పంచులకు శిక్షణ తరగతులు

మల్యాల మండలం నూకపల్లి న్యాక్ సెంటర్‌లో నిర్వహిస్తున్న సర్పంచ్ ల శిక్షణ తరగతులకు శుక్రవారం వివిధ మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు. ఈ శిక్షణ తరగతుల వల్ల సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధి ప్రణాళికలు, పంచాయతీరాజ్ చట్టాలు, గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగం, పరిపాలన వంటి అంశాలపై నిపుణులు మహేశ్వర్ రెడ్డి అవగాహన కల్పించారు..
News February 27, 2026
తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్ ప్రావీణ్య

రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గ్రామాల్లో నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News February 27, 2026
HYD: Gen Z తెలివి.. ‘చెత్త’ నుంచి డబ్బు!

HYD యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్. వ్యర్థాలను అర్థాలుగా మార్చుతున్న ఈ Gen Z తెలివితేటలు అమోఘం.


