News October 18, 2024
రేపు నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళ

నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం రేపు ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి బి.పి మధుసూదన్ రావు తెలిపారు. ఉద్యోగ మేళాలో క్యాషియర్, ప్యాకెర్స్, సేల్స్ అసోసియేట్స్, పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలకు అవకాశం ఉందని అన్నారు. జిల్లా కలెక్టరెట్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెన్త్, ఇంటర్ పాసై 18 నుంచి 26 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.
Similar News
News December 23, 2025
నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి: అదనపు డీసీపీ

శాస్త్ర సాంకేతిక నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేసుల పరిశోధనలో నాణ్యతను పెంచి FIR నుంచి అంతిమ రిపోర్ట్ వరకు ఉండవలసిన మెలుకువల గురించి క్షుణ్ణంగా వివరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు,టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
News December 22, 2025
UPDATE: 9 నెలల బాబు విక్రయం కేసులో ఐదుగురి అరెస్ట్

NZBలో 9 నెలల బాబును విక్రయించిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లుNZB వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. KMRకు చెందిన సీమ, షరీఫ్ NZB రైల్వే స్టేషన్ వద్ద 9 నెలల బాబుతో భిక్షాటన చేస్తూ బాబును విక్రయించారు. వారిద్దరితో పాటు మధ్యవర్తులుగా ఉండి బాబును విక్రయించిన రెహనా బేగం, సర్ తాజ్ అన్సారీ తో పాటు కొనుగోలు చేసిన సలావుద్దీన్ ఖురేషీని అరెస్ట్ చేశామన్నారు.
News December 22, 2025
NZB: జిల్లాలో లోక్ అదాలత్ లో 63, 790 కేసుల పరిష్కారం

ఆర్మూర్, బోధన్ కోర్టులతో పాటు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో సివిల్, రాజీకి వీలున్న క్రిమినల్ కేసులు మొత్తం 63,790 రాజీ పద్ధతిన పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఐదవ స్థానం లభించిందని ఆమె తెలిపారు.


