News July 10, 2025

రేపు నిర్మల్‌లో కాంగ్రెస్ మీటింగ్

image

నిర్మల్ మారుతి ఇన్ హోటల్‌లో శుక్రవారం కాంగ్రెస్ జిల్లా సమావేశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశానికి స్థానిక సంస్థల ఎన్నికల ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ జనరల్ సెక్రటరీ రాంభూపాల్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తలు మీటింగ్‌ను సక్సెస్ చేయాలని కోరారు.

Similar News

News July 11, 2025

కానిస్టేబుల్ వైష్ణవి సేవలను అభినందించిన CP

image

రాచకొండ కమిషనర్ సుదీర్‌బాబు తలపెట్టిన విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబర్ అవగాహన కల్పిస్తున్న ఎల్బీనగర్ కానిస్టేబుల్ వైష్ణవిని ప్రశంసించారు. ప్రజలకు సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను గుర్తించి, తన క్యాంప్ కార్యాలయంలో రివార్డు అందజేశారు. బీటెక్ చేసిన వైష్ణవి 2024 బ్యాచ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు.

News July 11, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అన్ని మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల, రేషన్ కార్డుల వేరిఫికేషన్, భూ భారతి దరఖాస్తుల పరిస్కారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించారు.

News July 11, 2025

NZB: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి 7 రోజుల జైలు: SHO

image

మద్యం అతిగా సేవించి రైల్వే స్టేషన్ ఏరియాలో న్యూసెన్స్ చేసి శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన షేక్ ఫెరోజ్ (30) అనే వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి గురువారం తీర్పు చెప్పారని NZB వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మగడమునగర్‌కు చెందిన షేక్ ఫెరోజ్ బుధవారం రాత్రి రైల్వే స్టేషన్ వద్ద అతిగా మద్యం సేవించి హంగామా చేశాడన్నారు.