News March 10, 2025

రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళా

image

రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు డీసీసీ కార్యదర్శి పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం పరిగిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Similar News

News February 27, 2026

ముమ్మిడివరం: భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

image

ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో పితాని బాలకృష్ణ(51) అనే వ్యక్తి భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పిట్టగోడపై ఇటుకలు అందిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News February 27, 2026

మన్యం: గురుకులంలో డయేరియా కలకలం

image

కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. 6 తరగతి విద్యార్థినులు మండంగి హేమలత, కోలక అనసూయ, కొండగొర్రె అనుశ్రీ అస్వస్థతకు గురై పాఠశాలలోనే చికిత్స పొందుతున్నారు. ఆరిక, ప్రణవి, శృతి దేవిలను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తాగునీరు, ఆహార పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

News February 27, 2026

ఏయూలో మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై కఠిన చర్యలు: లోకేశ్

image

గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో మండిపడ్డారు. వర్సిటీలో అక్రమ నియామకాలపై మ్యాన్ పవర్ ఆడిట్ చేస్తున్నామని, నెల రోజుల్లో అనర్హులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆడిట్ తర్వాతే కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్ నివేదిక రాగానే కఠిన చర్యలు తప్పవన్నారు.