News October 21, 2025

రేపు పాఠశాలలకు సెలవు: నెల్లూరు DEO

image

నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాజా బాలాజీ రావు తెలిపారు. వాతావరణ శాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయా మండలాల విద్యాధికారులు పాఠశాలలకు సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News October 21, 2025

రేపు అన్ని జూనియర్ కాలేజీలకు సెలవు

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు RIO వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 21, 2025

పురమిత్ర యాప్‌తో ఆన్లైన్ సేవలు సులభతరం

image

పురమిత్ర యాప్ ద్వారా మున్సిపల్ ఆన్లైన్ సేవలు సులభతరం అవుతాయని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్
మంగళవారం తెలిపారు. పురమిత్ర ఫోన్ యాప్ ద్వారా వివిధ రకాల టాక్స్‌లు సులభంగా చెల్లించవచ్చన్నారు. https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దీని ద్వారా ఫిర్యాదులు కూడా చేయవచ్చని పేర్కొన్నారు.

News October 21, 2025

కావలిలో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

image

కావలిలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలో మంగళవారం రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రైలు పట్టాలపై మహిళ మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, మృతురాలు పూర్తి వివరాలు తెలియాల్సింది.