News September 11, 2025
రేపు పాడేరులో ఆరోగ్య పరీక్ష శిబిరం

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం (రేపు) ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనునట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనునట్లు తెలిపారు.
Similar News
News September 11, 2025
అంబేడ్కర్ వర్సిటీలో చేరేందుకు రేపే ఆఖరు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 12వ తేదీ వరకు గడువు ఉందని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజనులకు ఉచితంగా విద్య అందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News September 11, 2025
విశాఖ: లొట్టలేసుకుని తింటున్నారా.. జర జాగ్రత్త..!

విశాఖలో 500 హోటళ్లు, 1200 వరకు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే వీటిలో ఆహార నాణ్యతపై దృష్టి సారించిన జీవీఎంసీ.. జోన్‌కు రెండు చొప్పున శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు ఏర్పాటు చేసింది. మొత్తం 16 టీంలు నెల రోజులుగా సోదాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు 302 హోటళ్లలో తనిఖీలు చేసి 173 హోటళ్లలో నిల్వచేసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి జరిమానాలు విధించింది.
News September 11, 2025
KU పీజీ ఫలితాలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్) 4వ సెమిస్టర్ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్ ఏప్రిల్, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్ జూన్, ఎంఏ(ఇంగ్లిష్) మొదటి సెమిస్టర్ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాల కోసం www.kuexams.org యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.