News February 15, 2026

రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు: అనకాపల్లి కలెక్టర్

image

మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 16వ తేదీన నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఐచ్ఛిక సెలవు దినం ప్రకటించడంతో కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలను రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News February 21, 2026

నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులను ఏరివేస్తాం: అమిత్ షా

image

అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచి కూడా తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులనూ మరో ఐదేళ్లలో ఏరివేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలోని కామ్‌రూప్‌లో ఆయన మాట్లాడారు. ‘అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని రాహుల్ చెప్పారు. కానీ ఆ పని చేయరు. ఎందుకంటే వారే ఆ పార్టీకి ఓటు బ్యాంక్. INC విధానాలు అస్సాంకు ముప్పుగా మారాయి’ అని ఆరోపించారు.

News February 21, 2026

HYD: TG EAPCET పరీక్షకు 20వేల దరఖాస్తులు

image

TG EAPCET ప్రవేశ పరీక్షకి ఈ రోజు ఇంజినీరింగ్ విభాగానికి 12,770 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 7,354 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 విభాగాలకు సంబంధించి 19 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు వరకు 20,143 దరఖాస్తుకు వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

News February 21, 2026

రాజమండ్రి: టెన్త్‌తో ఉద్యోగాలు..19-35 ఏళ్లు వారే అర్హులు

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఫిబ్రవరి 23వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 19-35 ఏళ్లు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని వివరించారు.