News February 1, 2025
రేపు పెద్దగట్టు ఆలయం వద్ద దిష్టి పూజ
పెద్దగట్టు జాతర వద్ద ఆదివారం దిష్టి పూజ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దిష్టి పూజ నిర్వహిస్తారని పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య యాదవ్ తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
Similar News
News February 1, 2025
చెర్వుగట్టు ఆలయ స్థల పురాణం ఇదే!
చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.
News February 1, 2025
మిర్యాలగూడ: భూ తగాదాలతో యువకుడిపై హత్యాయత్నం..!
మిర్యాలగూడ కోర్టు ఎదుట దామరచర్ల మం. వీర్లపాలెంకి చెందిన అల్లం మహేశ్‌పై నలుగురు యువకులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. 30 ఏళ్ల క్రితం మంద మహేశ్, శేఖర్ కుటుంబ సభ్యుల వద్ద అల్లం మహేశ్ కుటుంబ సభ్యులు వీర్లపాలెంలోని భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భూమి విషయంలోనే మహేశ్‌పై మంద కుటుంబ సభ్యులు దాడి చేశారన్నారు.
News February 1, 2025
ఇండోనేషియా అమ్మాయితో గుండ్రాంపల్లి యువకుడు పెళ్లి
చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన అబ్బాయి ఇండోనేషియాకు చెందిన అమ్మాయి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సీమ సాలయ్య-యాదమ్మల కుమారుడు నాగరాజు హైదరాబాద్లోని సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇండోనేషియాకి చెందిన రిక్కి సన్డా సెఫిట్రి అదే కంపెనీలో పనిచేస్తోంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇటీవల బంధువులు సమక్షంలో ఒక్కటయ్యారు.