News September 20, 2025

రేపు పేరుపాలెం బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్: కలెక్టర్

image

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో శనివారం బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ తీరప్రాంత మిషన్ పథకం కింద సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మద్యం షాపులు, పర్మిట్ రూముల వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధాన్ని వారం రోజుల్లోగా అమలు చేయాలన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు.

News September 19, 2025

భీమవరం: ఈవీఎంల భద్రతను తనిఖీ చేసిన కలెక్టర్

image

కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం భీమవరంలోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో ఆమె సంతకం చేశారు. పలు సూచనలను కలెక్టర్ అందజేశారు. విధుల్లో ఉన్న పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News September 19, 2025

ఏలూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

ఏలూరు రూరల్ పరిధిలోని ఓ దాబాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరు యువతులను అరెస్టు చేశామని SI నాగబాబు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వహకుడిపై కేసు నమోదు చేశామన్నారు.