News December 28, 2025

రేపు ప్రజావాణి యథాతధం: ASF కలెక్టర్

image

ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 29వ తేదీ నుంచి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం యథాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 29, 2025

ఛాంపియన్‌‌గా సూర్యాపేట

image

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురుషుల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో సూర్యాపేట జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో గద్వాల జట్టుపై 12 పాయింట్ల ఆధిక్యంతో సూర్యాపేట ఘనవిజయం సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామా నర్సింహారావు క్రీడాకారులను అభినందించారు. జట్టును విజయపథంలో నడిపించిన కోచ్‌ నరసింహారావును ప్రశంసించారు.

News December 29, 2025

మడకశిర MLA ఇంట్లో సినీ హీరోల సందడి

image

అనంతపురంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నివాసానికి ప్రముఖ సినీ హీరో సాయికుమార్, తనయుడు హీరో ఆది, ‘శంబాల’ చిత్రం హీరోయిన్ అర్చన, చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం వెళ్లారు. వారికి ఎంఎస్ రాజు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సాయి కుమార్‌కు, అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. సినిమాకు సంబంధించిన పలు విషయాలను ఎమ్మెల్యే వారిని అడిగి తెలుసుకున్నారు.

News December 29, 2025

చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి?

image

శివాలయాల్లో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి ఎడమ వైపుగా అభిషేక జలం బయటకు వచ్చే ‘సోమసూత్రం’ వరకు వెళ్లాలి. ఆ నీటిని దాటకుండా, తిరిగి వెనక్కి వస్తూ ధ్వజస్తంభాన్ని చేరుకోవాలి. ఆపై కుడి వైపుగా సోమసూత్రం వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి. ఇలా ఓసారి పూర్తి చేస్తే ఓ చండీ ప్రదక్షిణ అవుతుంది. సోమ సూత్రం దాటకుండా చేసే ఈ ప్రదక్షిణ అతి శక్తిమంతమైనది.