News December 28, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం జిల్లాస్థాయిలో అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో యధావిధిగా ఉంటుందని కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు.
Similar News
News December 30, 2025
సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు కీలక రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం-తిరుపతి, విశాఖ-బెంగళూరు, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ వంటి 9 జతల రైళ్లకు జనవరి 1 నుండి వివిధ తేదీల్లో అదనపు ఏసీ, స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రశాంత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు 3rd AC కోచ్‌ను కూడా చేర్చారు.
News December 30, 2025
పెద్దహరివాణం మండలం పేరు మార్పుపై ఉద్రిక్తత

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద హరివాణం గ్రామంలో ఆందోళన తీవ్రతరమైంది. మంగళవారం సిరుగుప్ప, ఆదోని రోడ్డుపై స్థానికులు వందలాదిమంది బైఠాయించి టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు.పెద్దహరివాణం మండలంగా గత నెలలో నోటిఫికేషన్ వచ్చిందన్నారు. పెద్దహరివాణంకు బదులుగా ఆదోని మండలంను ఒకటి, రెండుగా విభజించి ప్రకటించడం తగదని ఆగ్రామంలో నాయకుడు ఆదినారాయణ రెడ్డి నిరవధిక దీక్షకు పూనుకున్నారు.
News December 30, 2025
జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకం: మెదక్ అదనపు కలెక్టర్

పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకమని అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ అన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు. పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు.


