News April 1, 2026

రేపు ప్రధానితో లోకేశ్ భేటీ

image

AP: మంత్రి లోకేశ్ ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉ.10.30 గం.కు ప్రధాని మోదీని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. అంతకుముందు అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చను మొత్తం టీవీలో చూశానని లోకేశ్ తెలిపారు. జ‌గ‌న్ ఎన్ని జ‌న్మ‌లెత్తినా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక‌నూ తాక‌లేడని స్పష్టం చేశారు.

Similar News

News April 14, 2026

నవ్వు వెనుక తీరని విషాదం.. చిత్ర ట్వీట్ వైరల్!

image

చెరగని చిరునవ్వుతో, మధురమైన గొంతుతో మనల్ని అలరించే సింగర్ చిత్ర మనసులో తీరని వేదన దాగి ఉందనే విషయం మీకు తెలుసా? 2011లో దుబాయ్‌లో తన ఒక్కగానొక్క బిడ్డ నందన కళ్లముందే స్విమ్మింగ్ పూల్‌లో పడి కన్నుమూశారు. ఇవాళ ఆమె వర్ధంతి కావడంతో చిత్ర భావోద్వేగ ట్వీట్ చేశారు. బిడ్డ లేదన్న నిజం ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుందని, కానీ తన గుండెల్లో ఎప్పటికీ ఉంటుందని చిత్ర రాసుకొచ్చారు. ఇది చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

News April 14, 2026

ఫ్యాటీ లివర్.. A Big Problem.. లక్షణాలు, నివారణ

image

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం 130Cr మంది ఈ వ్యాధి(MASLD)తో బాధపడుతుండగా 2050 నాటికి ఈ సంఖ్య 200Crకు చేరొచ్చని ‘ది లాన్సెట్’ అంచనా వేసింది. లిక్కర్ అలవాటు లేకపోయినా కొవ్వు పేరుకుపోవడం, ఒబెసిటీ, టైప్ 2 డయాబెటిస్, బీపీ వల్ల ఇది వస్తుంది. కామెర్లు, అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గుదల దీని లక్షణాలు. డాక్టర్ సూచన మేరకు జీవనశైలి మార్పులు, మందులతో అదుపులో ఉంచుకోవచ్చు.

News April 14, 2026

స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. పిక్స్ వైరల్

image

హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో జరిగిన ఫొటోషూట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారు. ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ కవర్ పేజీ కోసం ఆయన వైట్ అండ్ వైట్ సూటులో క్లాసీగా మెరిశారు. ఓడపై దిగిన ఈ ఫొటోలతో పాటు, బ్రౌన్ కలర్ సూటులో ఉన్న మరిన్ని చిత్రాలను మ్యాగజైన్ తన X ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. చరణ్ గ్రేస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.