News October 10, 2025

రేపు ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన ప్రారంభం: కలెక్టర్

image

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన (PMDDKY) శనివారం ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. దేశవ్యాప్తంగా 100 వెనుకబడిన వ్యవసాయ జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం రూపొందించినట్లు చెప్పారు. ఇందులో జనగామ జిల్లా ఎంపిక కాగా రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన సాగునీరు, సులభంగా రుణాలు అందించడం ద్వారా పేదలు, రైతులు, యువత, మహిళలకు లబ్ధి చేకూరుతుంది.

Similar News

News October 10, 2025

నిర్మల్: పత్తి కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి

image

పత్తి పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో పత్తి పంట కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియను నిర్ణిత సమయానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు.

News October 10, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: అదనపు కలెక్టర్

image

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కొనుగోలు కమిటీ ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్లు కలిగిన రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

News October 10, 2025

సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

image

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.